Super Earths/Aliens

సూపర్ ఎర్త్స్ & ఏలియన్స్

మరుగుజ్జు గ్రహం అంటే ఏమిటి?

What is a dwarf planet?

గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉన్న చిన్న గ్రహాన్ని మరగుజ్జు గ్రహం అంటారు.

బలహీనమైన గురుత్వాకర్షణ శక్తి కారణంగా వాటి కక్ష్యలు శిధిలా (debris) లను కలిగి ఉంటాయి.

మరగుజ్జు గ్రహాలు ఇతర గ్రహాలకు ఉపగ్రహాలా?

కాదు, అవి ఇతర గ్రహాల ఉపగ్రహాలు కావు.

గ్రహం planet) అంటే ఏమిటి?

గ్రహం అనేది ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతూ గురుత్వాకర్షణ కలిగి ఉండే బలమైన గోళాకార ఖగోళ వస్తువు.

ఎన్ని మరగుజ్జు గ్రహాలు కనుగొనబడ్డాయి?

ఇప్పటి వరకు మూడు మరగుజ్జు గ్రహాలను కనుగొన్నారు.

  • ప్లూటో (మన సౌర వ్యవస్థలో వుంది)
  • సెరెస్ (ఆస్టరాయిడ్ బెల్ట్‌లో వున్నది)
  • ఎరిస్ (కైపర్ బెల్ట్‌లో వుంది)

మరిన్ని మరగుజ్జు గ్రహాలు కూడా ఉన్నాయి; అవి త్వరలో గుర్తించబడతాయి.

సౌర వ్యవస్థ అంటే ఏమిటి?

సూర్యుడు దానితో అనుసంధానించబడిన అన్ని గ్రహాలు మరియు ఇతర గ్రహ శకలాలను కలిపి సౌర వ్యవస్థ అంటారు.

ఆస్టరాయిడ్ బెల్ట్ (Asteroid belt) అంటే ఏమిటి?

ఇది మార్స్ మరియు బృహస్పతి మధ్య సూర్యుని చుట్టూ తిరుగుతున్న చదునైన ఒక వలయం లాంటిది.

ఇది చిన్న చిన్న రాతి శకలాలను కలిగి ఉంటుంది. ప్రతి శకలం దాదాపు 600 మైళ్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం కలిగి ఉంటుంది.

కైపర్ బెల్ట్ (Kuiper belt) అంటే ఏమిటి?

ఇది నెప్ట్యూన్ గ్రహం యొక్క కక్ష్యకు ఆవల సూర్యుని చుట్టూ తిరుగుతున్న మంచుతో నిండిన చిన్న చిన్న శకలాలను కలిగిన చదునైన ఒక వలయం.

దీనికి డచ్-అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త అయిన గెరార్డ్ పి. కైపర్ యొక్క పేరు పెట్టారు.

ప్లూటో:

గ్రహ స్థాయి నుండి మరుగుజ్జు గ్రహంగా (dwarf planet) గా ఎందుకు డౌన్‌గ్రేడ్ చేయబడింది?

ప్లూటో కనుగొనబడిన 76 సంవత్సరాల తర్వాత 2006 వరకు దానిని గ్రహంగా పరిగణించారు.

IAU (ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్) సభ్యులు 2006లో తీవ్ర చర్చ తర్వాత ప్లూటో హోదాను మన సౌర వ్యవస్థలో తొమ్మిదవ గ్రహ స్థాయి నుండి మరగుజ్జు గ్రహ స్థాయికి తగ్గించారు.

ఖగోళ శాస్త్రవేత్త క్లైడ్ W. టోంబాగ్ (Clyde W. Tombaugh) అరిజోనాలోని ఫ్లాగ్‌స్టాఫ్‌లోని లోవెల్ అబ్జర్వేటరీలో విలియం హెచ్. పికరింగ్ (William H. Pickering) సహకారంతో 1930లో ప్లూటోను కనుగొన్నారు.

మన సౌర వ్యవస్థ వెలుపల మరగుజ్జు గ్రహాలు కాకుండా వేరే గ్రహాలు ఏమైనా ఉన్నాయా?

ఎస్, ఉన్నాయి. మన సౌర వ్యవస్థకు ఆవల ఇతర రకాల గ్రహాలు ఉన్నాయి. వాటిని ఎక్సోప్లానెట్స్ (exoplanets) అంటారు.

ఎక్సోప్లానెట్స్ అంటే ఏమిటి?

ఇవి అదనపు సౌర గ్రహాల సంక్షిప్త రూపం. అవి మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్నాయి.

వాటిని సూపర్ ఎర్త్స్ (super-Earths) మరియు హాట్ జూపిటర్స్ (hot Jupiters) అని పిలుస్తారు.

సూపర్ ఎర్త్స్ / Super-Earths:

అవి రాక్ మరియు మంచుతో తయారు కాబడ్డాయి. వాటి పరిమాణం భూమి పరిమాణం కంటే రెండు నుండి మూడు రెట్లు ఉంటుంది.

అవి మన సూర్యుడి కంటే సగం పరిమాణంలో వున్న సూర్యుని (చల్ల బడ్డ రెడ్ స్టార్) చుట్టూ తిరుగుతున్నాయి.

సూపర్ ఎర్త్స్‌లో జీవం (life) వుండే అవకాశం వుందా?

ఎస్, సూపర్ ఎర్త్స్‌లో జీవం ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఒక సూపర్-ఎర్త్ దాని సూర్యుని (ఎరుపు నక్షత్రం) చుట్టూ సురక్షితమైన దూరంలో కదులుతుంటే అక్కడ జీవజాలం మనుగడ సాగించే అవకాశం వుంది.

వేడి-బృహస్పతులు (hot Jupiters):

అవి గ్యాస్‌తో నిండి వున్నాయి. అవి తమ నక్షత్రాలకు (సూర్యులు) దగ్గరగా పరిభ్రమిస్తున్నాయి. అవి మన బృహస్పతి కంటే పెద్దవి. వాటి యొక్క భారీ సైజును బట్టి వాటిని సులభంగా గుర్తించగలము.

Presented by:

Leave a Reply